![]() |
![]() |
.webp)
రేణు దేశాయ్ గురించి ఒక మంచి నటి మాత్రమే కాదు, ఒక మంచి తల్లి అలాగే ఎలాంటి సోషల్ కాజ్ కోసం ఐనా కానీ తన వంతు ప్రయత్నం చేయడంలో ముందుంటుంది. మూగ జీవాల కోసం ఆమె చాలా చేస్తూ ఉంటుంది. అలాంటి రేణు దేశాయ్ రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "ఎందుకు పాలిటిక్స్ లో ఉన్న మహిళలు, పురుషులు అలాగే ప్రభుత్వ రంగాల వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ?ఇది 2025 ఐనా కానీ ఇప్పటికీ మనం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సరైన రోడ్లు కానీ లేక అవస్థలు పడుతున్నాం..మనం కేవలం పన్నులు చెల్లించడం లేదు, అవినీతికి మూల్యం చెల్లిస్తున్నాము. " అంటూ పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి దగ్గరలో 250 కోట్లతో నిర్మించి ప్రారంభించిన కొన్ని రోజులకే రోడ్డు నాశనమవడం మీద ఆమె ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రేణు దేశాయ్. వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు రోడ్లు బాలేని కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే రోడ్లు బాలేని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. రేణు దేశాయ్ ఈ రోడ్ల విషయంలో చాలా రోజుల నుంచి తనదైన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా మందికి సూటైన ప్రశ్నలు వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లు ఏ కాంట్రాక్టర్ కట్టాడు ..ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అప్రూవ్ చేసాడు. ఎంత ఖర్చు అయింది. ఏ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు . ఏ ఫర్మ్ మెయింటెనెన్స్ చేస్తోంది ? అంటూ ఉన్న ఒక పోస్ట్ ని కూడా ఆమె తన స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.
![]() |
![]() |